- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EV tips: ఈవీలో లాంగ్ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? ముందే చెక్ చేసుకోవాల్సిన కీలక విషయాలివే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles) వాడకం మరీ ఎక్కువైంది. దీనికి అనుగుణంగా సేల్స్ కూడా పెరిగాయి. ఈవీ(EV)లపై లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే కొంతమంది ఎలక్ట్రానిక్ వాహనాలపై లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు భయపడిపోతుంటారు. కానీ ఎలాంటి భయం లేకుండా ఈ వాహనంపై లాంగ్ రోడ్ ట్రిప్(long road trip) ప్రారంభించే ముందు.. కొన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
లాంగ్ ట్రిప్ వెళ్లేటప్పుడు ముందుగా ఛార్జింగ్(charging) ఫుల్ ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ప్రయాణించే దూరం ఆ బ్యాటరీ(Battery)తో వెళ్లగలదో లేదో ఒకసారి నిర్ధారించుకోండి. ఎలక్ట్రిక్ వాహనం సాధారణంగా ఛార్జింగ్ అయిపోయేలోపు దాని సెల్స్ ను ఆటోమేటిక్ గా బ్యాల్స్ చేస్తుంది. కాగా మీరు వంద శాతం ఛార్జ్ చేస్తే సరిపోతుంది.
వాహనంలో ముఖ్యమైన భాగాల్లో టైర్లు(Tires) ఒకటి. కాగా మంచి పట్టు కోసం టైర్‌లో ట్రెడ్ డెప్త్(Tread depth) ఉండాలి. తడి, జారిపోయే రహదారిపై ట్రెడ్ డెప్త్ చాలా ముఖ్యం. ఒకవేళ ఉబ్బుగా, అసమాన ట్రెడ్, బొబ్బలు, సైడ్ వాల్ డ్యామేజ్ ఉంటే కనుక ముందే చెక్ చేసుకుని మార్చాలి. అలాగే టైర్లలో సరైన స్థాయిలో ఎయిర్ ప్రెజర్(Air pressure) ను మెయింటైన్ చేయాలి. బ్రేక్ ప్యాడ్ మెటీరియల్(Brake pad material) ఉండాలి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా బ్రేక్ వైఫల్యాన్ని నివారిస్తుంది.
శక్తిని ఆదా చేయడానికి రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్(Regenerative braking system) సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి. కానీ ఇది బ్యాటరీ 80 శాతం కంటే తక్కువగా ఉంటేనే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం వేడెక్కకుండా చూసుకోండి. కూలింగ్ సిస్టమ్(Cooling system) పనితీరును చెక్ చేయండి. ఛార్జింగ్ కేబుల్(Charging cable) పనితీరును, ఏదైనా డ్యామేజ్ ఉందో.. తుప్పు, లూజ్ కనెక్షన్స్(Loose connections) వంటివి ముందే చూడండి. ఈవీలో లాంగ్ ట్రిప్ వెళ్లాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోండి. దీంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని(Safe journey) ఆస్వాదించవచ్చు.