- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీవీఐపీ చాపర్ కేసులో మాజీ జాతీయ ఆడిటర్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: వీవీఐపీలకు అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో అగస్టా-వెస్ట్‌లాండ్అవినీతి కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్‌లపై సీబీఐ అనుబంధ చార్జిషీట్ మోపింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన రూ. 3,200 కోట్ల కుంభకోణం కేసులో శశికాంత్ శర్మ, మరో నలుగురు సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులపై సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తదితర అత్యంత ప్రముఖ నేతల సేవల కోసం 12 వీవీఐపీ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీతో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో పాలు పంచుకునే కంపెనీలు 6 వేల మీటర్ల ఎత్తులో హెలికాప్టర్లు నడిపిన అనుభవం పొంది ఉండాలని భారత వాయుసేన విధించిన పరామితిలో లేకపోయినప్పటికీ అగస్టా వెస్ట్ లాండ్ ఈ ఒప్పందాన్ని దక్కించుకుంది. 2016 లో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక బృందం మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి, మరో 11 మందిపై 2017 సెప్టెంబర్ 1న తొలి చార్జిషీట్ మోపింది. అభ్యంతరాలున్నప్పటికీ హెలికాప్టర్స్ ఆపరేషనల్ సీలింగ్ ప్రమాణాలను తగ్గించి మరీ త్యాగి అగస్టా కంపెనీకి మేలు చేశారని సీబీఐ ఆరోపించింది.