వర్గపోరుతో ఆగిన ఇళ్ల పంపకం.. రాత్రికి రాత్రే ఆక్రమించిన గ్రామస్తులు

by Javid Pasha |
వర్గపోరుతో ఆగిన ఇళ్ల పంపకం.. రాత్రికి రాత్రే ఆక్రమించిన గ్రామస్తులు
X

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్గ విబేధాలతో పెరుగుతున్నాయి. వాటి కారణంగానే గత రెండు సంవత్సరాలు క్రితం నిర్మించిన యాబై డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపకం నిలిచిపోయింది. వీటికోసం లబ్ధిదారులను ఎంపిక చేసినా కూడా ఇళ్ల పంపిణీ చేయకుండా అధికారులు కాలయాపన చేశారు. అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో లబ్దిదారులు ఆగ్రహించారు. అంతేకాకుండా సోమవారం రాత్రి తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్‌ల తాళాలు పగలగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు.

Advertisement

Next Story