Health Tips : మీరు నాన్‌వెజ్ తినరా..? ప్రొటీన్స్ కోసం ఈ ఫుడ్ తింటే చాలు..

by Javid Pasha |   ( Updated:2022-03-30 03:39:36.0  )
Health Tips : మీరు నాన్‌వెజ్ తినరా..? ప్రొటీన్స్ కోసం ఈ ఫుడ్ తింటే చాలు..
X

, ఫీచర్స్ : రోజువారీ తీసుకునే ఆహారంలో ప్రొటీన్ కంటెంట్ లోపిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా నాన్ వెజిటేరియన్స్‌కు చికెన్, చేపలు, గుడ్ల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి. కానీ వెజిటేరియన్స్‌కు ఎక్కువ ప్రొటీన్ ఫుడ్ అందుబాటులో లేదనే అపోహ ఉంది. వాస్తవానికి ప్రొటీన్స్ సమృద్ధిగా లభించే సమతుల ఆహారాన్ని పొందేందుకు శాకాహారులకే అపరిమిత ఫుడ్ చాయిసెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శరీరానికి సరిపడా ప్రొటీన్స్ కోసం వెజిటేరియన్స్ తీసుకోవాల్సిన కొన్ని డైట్స్ వివరాలు మీ కోసం..

శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా చర్మం, రక్తం, ఎముకల పుష్టికి ప్రొటీన్స్ దోహదపడతాయి. ఇవి లోపిస్తే డోపమైన్, సెరోటిన్ వంటి హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పత్తికాక మెదడు పనితీరు దెబ్బతింటుంది. మానసికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదంతో పాటు చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. చర్మం పొడిబారే లక్షణాలతో పాటు ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుంది. కండర ద్రవ్యరాశిని కూడా కోల్పోయేలా చేస్తుంది. అయితే నాన్ వెజిటేరియన్ ఆహారమే కాకుండా వెజిటేరియన్ డైట్ కూడా అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.


కాయధాన్యాలు : 100 గ్రాముల కాయధాన్యాల్లో 7 నుంచి 8 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇందులో నల్ల కాయధాన్యాలు, చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, బఠానీలు, పచ్చి కాయధాన్యాలు, బ్లాక్ బీన్స్ మొదలైనవి ఉంటాయి.

క్వినోవా : ఉసిరి జాతికి చెందిన క్వినోవాలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల క్వినోవాను డైట్‌లో భాగం చేసుకుంటే దాదాపు 9 గ్రాముల ప్రోటీన్‌ను లభిస్తుంది.

గుమ్మడి గింజలు : ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజల నుంచి 5 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.

పెరుగు : అందరికీ అందుబాటులో ఉండే ఫుడ్ ఐటెమ్ పెరుగు. 100 గ్రాముల పెరుగు నుంచి 9 గ్రాముల ప్రొటీన్ పొందవచ్చు.

ఆకుకూరలు : పాలకూరలో పోషకాలు అధికం. ప్రొటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఆకుకూరల్లో బచ్చలి కూర ఉత్తమమైనది.

క్యాబేజీ : 100 గ్రాముల క్యాబేజీలో దాదాపు 1 నుంచి 2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని తరచూ తినడం వల్ల ప్రొటీన్‌ లోపాన్ని అధిగమించవచ్చు.

పనీర్/టోఫు: చాలామంది వెజిటేరియన్స్ చికెన్‌కు ప్రత్యామ్నాయంగా పనీర్‌ను పరిగణిస్తారు. 100 గ్రాముల పనీర్‌ నుంచి 16 గ్రాముల ప్రొటీన్, 100 గ్రాముల టోఫు నుంచి 8 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.

పుట్టగొడుగులు, బంగాళాదుంప, నట్స్, బ్రకోలి, ప్రొటీన్ షేక్స్ నుంచి కూడా తగు మోతాదులో ప్రొటీన్స్ లభిస్తాయి. అయితే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవాలి. హెచ్చుతగ్గులుంటే సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల శరీరతత్వాన్ని బట్టి, డైటీషియన్‌ను సంప్రదించాకే డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed