Varun Tej: ‘మట్కా’ నుంచి సలోని ఫస్ట్ లుక్.. అమాయకంగా ఆకట్టుకుంటోన్న బ్యూటీ

by sudharani |   ( Updated:2024-10-21 15:01:16.0  )
Varun Tej: ‘మట్కా’ నుంచి సలోని ఫస్ట్ లుక్.. అమాయకంగా ఆకట్టుకుంటోన్న బ్యూటీ
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ సినిమా ‘మట్కా’ (Matka). వైరా ఎంటర్‌టైన్మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నా ఈ చిత్రానికి కరణ్ కుమార్ (Karan Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ‘మట్కా’ చిత్రం వరుణ్ తేజ్ (Varun Tej) సినీ కెరీర్‌లోనే అత్యంత హై బడ్జెట్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో.. వరుస అప్‌డేట్స్ (Updates)తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు ‘మట్కా’ (Matka) లోని సలోని (Saloni) పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘బలవంతం నుండి ధైర్యం వరకు.. ఆమె ప్రయాణం ఆశ & స్థితిస్థాపకతతో నిండి ఉంది. #MATKA నుండి #సలోనిని 'PADMA'గా పరిచయం చేస్తున్నాము’ అంటూ తెలిపారు. ఈ పోస్టర్‌లో సలోని (Saloni) లుక్ చాలా అమాయకంగా కనిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed