- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాసినో రచ్చ.. మంత్రి కొడాలి నానిపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
దిశ, ఏపీ బ్యూరో: 'గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించండి' అని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నాడని లేఖలో ఆరోపించారు. ప్రజలపై కొడాలి నాని, అతని అనుచరులు వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. గుడివాడలో కొడాలి నాని పీనల్ కోడ్, రాజ్యాంగం అమలులో ఉందని అందరూ అనుకుంటున్నారు. జనవరి 2022 లో గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు మీ కార్యాలయానికి అనేక లేఖల ద్వారా నివేదించబడం జరిగింది.
అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2015లో లంకా విజయ్ మరణం వాస్తవానికి రైలు ప్రమాదం గా మార్చబడిన ఆత్మహత్య. అడపా బాబ్జీ మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతో పాటు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నివేదికను కూడా బహిర్గతం చేయండి అని లేఖలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు.