నాటో ఎంటరైతే మూడో ప్రపంచ యుద్ధమే: అమెరికా

by GSrikanth |
నాటో ఎంటరైతే మూడో ప్రపంచ యుద్ధమే: అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నాటో ఎంటరైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నాటో దేశాల భూభాగంలోని ప్రతీ అంగుళాన్ని రక్షించుకుంటామని తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగబోమంటూనే రష్యా సరిహద్దులకు అమెరికా దాదాపు 12 వేల మంది బలగాలను పంపినట్లు సమాచారం.

Advertisement

Next Story