- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాడి పశువులపై విషప్రయోగం… ఆరు ప్రాణాలు బలి
దిశ, షాద్ నగర్: పాడినే నమ్ముకొని ఆ రైతు జీవితం సాగిస్తున్నాడు. అతడిని చూసి ఓర్చుకోలేక కొందరు దారుణానికి ఒడిగట్టారు. అన్నం పుణ్యం తెలియని అతని మూగజీవాలను విషం పెట్టి పొట్టనపెట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని భోదునంపల్లి గ్రామానికి చెందిన పిప్పల రమేష్ ఆవులపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దాంతో 6 పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి.
రమేష్ లక్షల రూపాయలు అప్పుచేసి 13 ఆవులు కొనుగోలు చేశాడు. వాటితో ప్రారంభించిన పాడి పరిశ్రమను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నాడు. అయితే అతనంటే గిట్టని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 13 ఆవులకు దాణాలో విషపు గుళికలు కలిపి పెట్టారు. వాటిలో 6 ఆవులు మృత్యువాత పడ్డాయి. పశువైద్యులు వైద్యం అందించగా 7 ఆవులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి.
జీవనోపాధి కోసం పాడి పరిశ్రమపై ఆధారపడుతున్న యువకున్ని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి సంఘటన జరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులపై విషప్రయోగం చేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవులు మృతి చెందడంతో దాదాపు 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.