- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరణించిన కార్మికులకు ఇండ్లిప్పిస్తా: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ బోయగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్కార్మికులకు, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు ఇప్పిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బోయగూడలో అగ్నిప్రమాదానికి గురైన టీంబర్ డిపోను ఆయన ఆదివారం పరిశీలించారు. బీహార్ నుంచి వచ్చిన 11 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలని సూచించారు. గతంలో ఓల్డ్ సిటీలో ఇలాంటి ఘటనే జరిగి పేద కార్మికులు చనిపోయారని, రాత్రి సమయంలో కార్మికులు పని స్థలాల్లో పడుకోకుండా చూడాలని సూచనలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలంగాణ సర్కార్గుర్తించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది సమన్వయంగా పనిచేయాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం కూడా సాయం అందించిందని ఆయన గుర్తుచేశారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో మాట్లాడి బాధిత కుటంబాలకు ఇండ్లు అందించేందుకు కృషిచేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.