ఇతర దేశాలతో పోలిస్తే మనమే బెటర్.. ఇంధన ధరలపై కేంద్రమంత్రి

by Harish |
ఇతర దేశాలతో పోలిస్తే మనమే బెటర్.. ఇంధన ధరలపై కేంద్రమంత్రి
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరుగుతుండటం పై కేంద్ర మంత్రి హర్దీప్ పూరి పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. మంగళవారం లోక్ సభలో మాట్లాడిన ఆయన ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కేవలం 1/10 వంతు మాత్రమే పెరిగాయని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య అమెరికాలో గ్యాసోలిస్, పెట్రో ధరలు ఏకంగా 51 శాతం పెరిగాయని చెప్పారు. అదేవిధంగా కెనడాలో 52శాతం, జర్మనీలో 55 శాతం, యూకేలో 55శాతం, ఫ్రాన్స్‌లో 50శాతం, స్పెయిన్‌లో 58శాతం పెరిగాయన్నారు. దీనిని భారతదేశంతో పోల్చి చూసుకుంటే మన దగ్గర కేవలం 5 శాతం మాత్రమే ఇంధన ధరలు పెరిగాయని కేంద్ర సహజవాయువు పెట్రోలియం శాఖ మంత్రి సమాధానమిచ్చారు.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు లీటరుకు రూ.80 పైసలు పెరుగుతూ గత రెండు వారాల్లోనే మొత్తం రూ.9.20కి పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.103.81 నుంచి రూ. 104.61 పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు 95.07 నుంచి రూ. 95.87కి చేరుకుంది. దేశంలో మార్చి 22 నుంచి ఇంధన ధరలను కేంద్ర పెట్రోలియం సంస్థలు సవరిస్తూ రాగా నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు 13వ సారి పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed