- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి : కేటీఆర్
దిశ,తిమ్మాపూర్ : తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తంగా మార్చి 20న కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్ లో పోటీ పరీక్షలపై నిర్వహించనున్న అవగాహన సదస్సు పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన వెలువరించారని, నిరుద్యోగ యువత ఎటువంటి వదంతులు నమ్మకుండా పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడంపై సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఇతర గ్రూప్-1 అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మల్లేశ్ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.