- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ukraine: విషాదం.. మేయర్‌తో సహా కుటుంబం దారుణ హత్య
కీవ్: రష్యా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ రోజుకో విషాద ఘటనలు బయటకు వస్తున్నాయి. రష్యాన్ బలగాలు ఉక్రెయిన్ మేయర్ ఓల్గా సుఖెంకోతో పాటు ఆమె కుటుంబాన్ని దారుణంగా హతమార్చాయి. అతికిరాతకంగా వారిని హతమార్చి అటవీ ప్రాంతంలో గొయ్యిలో పడేసినట్లు అసోసియేటేడ్ ప్రెస్‌కు స్థానికులు తెలిపారు. రాజధాని కీవ్ పట్టణంలోని మెటిజైన్ పట్టణ మేయర్ గా గుర్తించారు.
రష్యా సైన్యం డిమాండ్లను తిరస్కరించడంతో మేయర్ భర్త, కొడుకును ముందుగా హతమార్చినట్లు తెలిపారు. కాగా, స్థానిక అధికారులను లక్ష్యంగా చేసుకుని, మాట వినని వారిని చంపినట్లు స్థానికులు వెల్లడించారు. మేయర్ కుటుంబాన్ని చంపి, వారి ఇంటిని ఆక్రమించుకున్నట్లు తెలిపారు. గత నెల 23న మేయర్ కుటుంబాన్ని రష్యా సైనికులు కిడ్నాప్ చేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి. తాజాగా మేయర్ కుటుంబం హత్యను ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ఇరినా వెరెశ్చుక్ నిర్ధారించారు.