- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్యన్లను పసిగడుతున్న 'క్లియర్ వ్యూ'.. స్పెషల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్న ఉక్రెయిన్
దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలెట్టినప్పటి నుంచి దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా వేస్తోంది. రష్యా దాడుల్లో వందలాది ఉక్రెయిన్ పౌరులు మరణించగా.. వేలాది మంది తమ కుటుంబాలతో విడిపోయినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో దేశంలో చొరబడుతున్న రష్యా దుండగులను గుర్తించేందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ 'క్లియర్‌వ్యూ AI' అనే US-ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. చెక్‌పాయింట్స్, ప్రజా సమూహాల్లో రష్యన్ చొరబాటుదార్లను పసిగట్టడంతో పాటు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు, చనిపోయిన వారిని గుర్తించేందుకు ఈ సాంకేతికత సాయపడుతోంది. ఇంతకీ యుద్ధ సమయంలో విశిష్ట సేవలందిస్తున్న 'క్లియర్‌వ్యూ ఏఐ' నేపథ్యమేంటి? ఉక్రెయిన్‌లో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? తదితర విశేషాలపై స్పెషల్ స్టోరీ!
'క్లియర్‌వ్యూ AI' ప్రారంభంలో Smartcheckr పేరుతో ఉండేది. ఆస్ట్రేలియన్ యాప్ డెవలపర్ హోన్ టన్-దట్, న్యూయార్క్ మాజీ మేయర్ రుడాల్ఫ్ గియులియాని, న్యూయార్క్ డైలీ న్యూస్ టాబ్లాయిడ్ ఎడిటర్ రిచర్డ్ స్క్వార్ట్జ్ కలిసి 2017లో దీన్ని స్థాపించారు. చట్టాన్ని అమలుచేసే సంస్థలు ఈ సాంకేతికతను వినియోగించడం మొదలుపెట్టడంతో అనతి కాలంలోనే సక్సెస్ బాట పట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారితమైన 'క్లియర్‌వ్యూ ఏఐ'లో న్యూస్ మీడియా, మగ్‌షాట్ వెబ్‌సైట్స్, పబ్లిక్ సోషల్ మీడియా, ఇతర ఓపెన్ సోర్సెస్ సహా పబ్లిక్-ఓన్లీ వెబ్ సోర్స్‌ల నుంచి సేకరించబడిన 10+ బిలియన్ ముఖ చిత్రాలతో కూడిన అతిపెద్ద డేటాబేస్ ఉంది. ప్రస్తుతం రష్యన్ చొరబాటుదారులను వెలికితీసేందుకు ఉక్రెయిన్ ఈ డేటాబేస్ వ్యవస్థను వినియోగిస్తోంది.
ఎలా ఉపయోగిస్తున్నారు?
రష్యన్ సోషల్ మీడియా సర్వీస్ VKontakte నుంచి తమ కంపెనీకి 2 బిలియన్‌కు పైగా చిత్రాలతో డేటాబేస్ ఉందని క్లియర్‌వ్యూ మేకర్స్ పేర్కొన్నారు. ముఖం దెబ్బతిన్నప్పటికీ ఇది మనుషులను గుర్తిస్తుంది. కుటుంబాల నుంచి విడిపోయిన శరణార్థులను తిరిగి కలపడానికి, రష్యన్ కార్యకర్తలను గుర్తించడానికి, యుద్ధానికి సంబంధించిన తప్పుడు సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించడానికి ప్రభుత్వానికి క్లియర్‌వ్యూ సాంకేతికత సాయపడుతుందని టన్-దట్స్ లేఖ పేర్కొంది. వాస్తవానికి రష్యన్ దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాల్లో పవర్‌ఫుల్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సహాయకారిగా ఉన్నప్పటికీ.. ఈ క్లియర్‌వ్యూ AI ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతకు వివాదాస్పద చరిత్ర ఉంది.
ప్రైవేట్ కస్టమర్స్ :
చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు కాకుండా వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ సర్వీస్‌కు యాక్సెస్ కలిగి ఉన్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ స్టార్టప్ ప్రారంభమైన కొత్తలో కంపెనీ పెట్టుబడిదారులు, క్లయింట్లు ఇతరులపై తరచుగా గూఢచర్యం చేసేందుకు ఉచితంగా ఉపయోగించారని సమాచారం. ఉదాహరణకు : బిలియనీర్ జాన్ కాట్సిమాటిడిస్.. తన కుమార్తె ఎవరితో డేటింగ్ చేస్తుందో గుర్తించేందుకు క్లియర్ వ్యూ సర్వీస్ ఉపయోగించాడు. అంతేకాక ఇందులో భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయితే తమది 'పోస్ట్ ఈవెంట్ ఇన్వెస్టిగేటివ్ టూల్' అని, నిఘా వ్యవస్థ కాదని క్లియర్‌వ్యూ AI పేర్కొంది. కానీ అటువంటి సాధనం ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే వారి గోప్యతను దెబ్బతీస్తుందనే ఆందోళనలున్నాయి.
లీగల్ ట్రబుల్స్ :
క్లియర్‌వ్యూ AI.. తమ వెబ్‌సైట్స్ నుంచి ఫొటోలను ఉపయోగిస్తోందని వెలుగులోకి వచ్చిన తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా టెక్ దిగ్గజ కంపెనీలు క్లియర్ వ్యూకు సీజ్ అండ్ డెసిస్ట్ నోటీసులు పంపాయి. స్పష్టమైన సమ్మతి లేకుండా ఇంటర్నెట్ నుంచి చిత్రాలను సేకరించడం ద్వారా గోప్యతా హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో యునైటెడ్ స్టేట్స్‌లో క్లియర్‌వ్యూ అనేక కేసులు ఎదుర్కొంటోంది. అదేవిధంగా ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఇటలీ, గ్రీస్, యూకేలోని డేటా-ప్రొటెక్షన్ ఆథారిటీస్.. యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 'క్లియర్ వ్యూ'పై ఫిర్యాదులు చేసింది. ఇటీవలే ఇటలీ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ.. GDPRని ఉల్లంఘించినందుకు Clearview AIకి వ్యతిరేకంగా 20 మిలియన్ యూరోల పెనాల్టీని ప్రకటించింది. ఇటాలియన్లకు సంబంధించిన పూర్తి డేటాను తొలగించమని ఆదేశించడంతో పాటు డేటాను ప్రాసెస్ చేయకుండా నిషేధించింది.
సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుంది?
ఇంటర్నెట్, ఇతర మాధ్యమాల నుంచి సేకరించిన ఫొటోల భారీ డేటాబేస్‌తో ముఖాలను సరిపోల్చడంలో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఈ మేరకు క్లియర్ వ్యూ సేకరించిన చిత్రాలన్నింటినీ వెక్టర్స్‌గా మార్చి 'నైబర్‌హుడ్స్' ఫోల్డర్‌లో దాస్తుంది. ఉదాహరణకు యూజర్ తన తాజా ఫోటోను క్లియర్‌వ్యూ సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేస్తే, దాన్ని కూడా వెక్టర్‌గా మార్చి ఫోల్డర్‌లో సేవ్ చేస్తుంది. ఈ క్లస్టర్‌లోని అన్ని ఫోటోలు ఒరిజినల్ వెబ్‌సైట్స్ లింక్స్‌తో సహా యూజర్‌కు ప్రదర్శితమవుతాయి. తద్వారా ముఖానికి పేరు పెట్టడం సులభం అవుతుంది.