- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. పనికోసం వెళ్లితే ప్రాణాలే పోయాయి
దిశ, బిచ్కుంద : జీవనోపాధి కొరకు కూలినాలి చేసుకుని బతికే కూలీలను ఇసుక లారీ రూపంలో మృత్యువు కబళించింది. లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన గంగాధర్ (28) సాయిరాం, చందు, కరుణ, సాయి కుమార్ బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి కూలి పని నిమిత్తం వెళ్లి తిరిగి ట్రాక్టర్ మీద వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ట్రాక్టరను ఢీకొనడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా సాయిరాం, చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందు, కరుణ, సాయి కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.