ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు

by Mahesh |   ( Updated:2022-03-09 16:48:16.0  )
ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు
X

దిశ, తుంగతుర్తి: దళితుల పై దాడికి పాల్పడిన వారిని సత్వరమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ పోలీస్ అధికారులను కోరారు. ఈ విషయంలో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం ఏ మాత్రం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో బాధిత దళితులను వారు బుధవారం పరామర్శించి వివరాలు సేకరించారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఈ దాడులకు పాల్పడిన విషయం తెలిసినప్పటి కూడా పోలీసులు వారిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు.

మల్లె పాక రామచంద్రు, ఎల్లమ్మ పై వ్యక్తిగత కారణాలతో దౌర్జన్యంగా కర్రలతో దాడి చేశారని, అడ్డు వచ్చిన వారిపై కూడా దాడులు చేశారని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. నిందితులపై కేవలం ఎస్సీ ఎస్టీ కేసు మాత్రమే నమోదు చేయడం సరికాదని వివరించారు. అసలైన నిందితులను కేసు నుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబం వారు ఆరోపించారు. అనంతరం వారు తుంగతుర్తి సీఐ నాగార్జునను పోలీస్ స్టేషన్ లో కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శ్రీరామ్ నవీన్, తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాబు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షురాలు స్వప్న, తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి మండలాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story