'నా కుటుంబంపై దాడి చేశారు.. ఇందులో ఎమ్మెల్యేకు సంబంధం లేదు'

by GSrikanth |
నా కుటుంబంపై దాడి చేశారు.. ఇందులో ఎమ్మెల్యేకు సంబంధం లేదు
X

దిశ, రామన్నపేట: గత నాలుగు రోజుల క్రితం మండలంలోని నిదానపెల్లి గ్రామంలోని మల్లన్నగుట్ట జాతరలో జరిగిన గొడవకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లన్నగుట్ట జాతరలో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నాతో పాటు నా కుటుంబసభ్యులపై దాడి చేశారని, అందుకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఈ విషయంలో టీఅర్ఎస్ పార్టీకి కానీ, ఎమ్మెల్యేకు కానీ, ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పోలీసుల దర్యాప్తులో తమపై దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని, ఈ విషయం గుర్తించాలని సూచించారు.

ప్రశాంతంగా జరుగుతున్న జాతరలో అల్లరిమూకలుగా తయారై దాడులు చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం వారికే చెల్లిందని విమర్శించారు. ఇష్టానుసారం మాట్లాడి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చెడ్డపేరు తీసుకొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అలజడులు సృష్టించే వ్యక్తులను ప్రోత్సహిస్తే వారికే నష్టమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, జెడ్పీటీసీ పున్న లక్ష్మిజగన్ మోహన్, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కమ్మంపాటి శ్రీనివాస్, సర్పంచులు కాటేపల్లి సిద్దమ్మ యాదయ్య, గుత్తా నర్సిరెడ్డి, కడమంచి సంధ్యాస్వామి, ఎంపీటీసీలు గాదె పారిజాత, ఏనుగు పుష్పమ్మ, నాయకులు పోషబోయిన మల్లేశం, బొక్క మాధవరెడ్డి ఎండీ ఆమేర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story