- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకున్న చిత్తనూరు తిరుమల్ రెడ్డి(68) బుధవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 1987లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తిరుమల్ రెడ్డి అనతికాలంలోనే రాజకీయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగిల్విండో చైర్మన్‌గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గద్వాల జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అనంతరం ఆయన ప్రజారాజ్యంలో చేరి గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నించాడు. టికెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో ఆయన తన దృష్టి అంతా తన సొంత మండలమైన ఐజపై సారించాడు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అలంపూర్ ఎమ్మెల్యే గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.
అనంతరం సొంత పార్టీలో ఉన్న విభేదాల కారణంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన అనుచర వర్గానికి అధికార టీఆర్ఎస్ పార్టీ బి-ఫారాలు కాకపోవడంతో ఎంపీపీ పదవికి రాజీనామా చేసి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దించి మెజారిటీ సభ్యులను గెలిపించుకున్నాడు. పార్టీ అధిష్టానం సూచనలతో గెలిచిన వారందరినీ తిరిగి అధికార పార్టీలో చేర్పించడంలో ప్రధాన భూమికను పోషించాడు. తన అనుచరులకు వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. మరోవైపు తన సొంత ఊరు చిత్తనూరులో ధన్వంతరి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మింపజేశాడు. ఐజ మండలం అభివృద్ధి కోసం కృషి చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు అధికార పార్టీ నేతలు అందరితోనూ మంచి సంబంధాలున్న తిరుమల్ రెడ్డి గత కొంతకాలం నుండి అనారోగ్యంగా ఉండటంతో పాటు ఇటీవల తన సొంత ఇంట్లో కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడంతో బ్రెయిన్డెడ్ అయినట్లుగా గుర్తించారు.
బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యులు విషయాన్ని ప్రకటించారు. తిరుమల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కళ్ళు, కిడ్నీ, కాలేయాలను దానం చేశారు. కాగా, తిరుమల్ రెడ్డికి భార్య సువర్ణ, కుమారుడు గౌతమ్ రెడ్డి ఉన్నారు. తిరుమల్ రెడ్డి అంత్యక్రియలు గురువారం వారి స్వగ్రామంలో జరగనున్నాయి. తిరుమల్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్, తదితరులు సంతాపం ప్రకటించారు. తిరుమల్ రెడ్డి లేని లోటు పార్టీకే కాకుండా, నడిగడ్డ ప్రాంతానికి తీరనిది అని వారు అభిప్రాయపడ్డారు.