- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్ రంగానికి విడిగా రెగ్యులేటర్: వ్యాపారుల సమాఖ్య
దిశ, వెబ్‌డెస్క్: చిన్న వ్యాపారాలు, వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ-కామర్స్ రంగానికి ప్రత్యేకమైన నియంత్రణ విభాగం ఏర్పాటు చేయాలని దేశీయ వ్యాపారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) అభిప్రాయపడింది. వివిధ ఈ-కామర్స్ సంస్థలు ప్రస్తుతం వేర్వేరు సంస్థల నుంచి నియంత్రించబడుతున్నాయి. దీనివల్ల భాగస్వామ్యం, వాటాదారుల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఏఐటీ తెలిపింది.
గత కొన్నేళ్లుగా ఈ-కామర్స్ రంగం వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులోని సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ-కామర్స్ రంగానికి రెగ్యులేటరీ అవసరం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పలు అంశాలను పరిశీలించి, ఎలాంటి వివక్షత లేకుండా డిస్కౌంట్లను అందించకుండా రెగ్యులేటరీ విధానం కావాలని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ మంగళవారం విడుదల చేసిన లేఖలో చెప్పారు.
ప్రస్తుతం ఈ-కామర్స్ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానం, కాంపిటీషన్ చట్టం-2002, వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఈ-కామర్స్ నియమాలు-2019, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ద్వారా నిర్వహించబడుతోంది. ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో తటస్థత లేకపోవడం, అధిక తగ్గింపు ఆఫర్లు, డేటా వినియోగం వంటి సమస్యలను పరిష్కరించాలని సీఏఐటీ సూచించింది.