ప్లాస్టిక్ ఇవ్వండి.. మనీ పొందండి!

by Manoj |
ప్లాస్టిక్ ఇవ్వండి.. మనీ పొందండి!
X

దిశ, ఫీచర్స్ : నోయిడాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న లిసిప్రియా కంగుజం చిన్నప్పటి నుంచి పర్యావరణ రక్షణ కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో పర్యావరణ, వాతావరణ కార్యకర్తగా గుర్తింపు పొందిన ఈ పదేళ్ల బాలిక.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే ఉద్దేశ్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి 'ప్లాస్టిక్ మనీ షాప్'ను ఢిల్లీ యూనివర్సిటీ(DU)లో ప్రారంభించింది.

పర్యావరణ క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచమంతటికీ పదునైన సందేశమిచ్చేందుకు ప్రయత్నిస్తున్న లిసిప్రియ 'ప్లాస్టిక్ మనీ షాప్'తో ఇందుకు శ్రీకారం చుట్టింది. ఈ దుకాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను అందిస్తే, బదులుగా స్కూల్ స్టేషనరీ వస్తువులు లేదా బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ విధంగా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రాజస్థాన్, గుజరాత్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అప్‌సైక్లింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు చేరవేస్తోంది. అక్కడ వీటితో ఎకోఫ్రెండ్లీ రోడ్ టైల్స్, హౌస్ రూఫ్ షీట్స్, బ్రిక్స్, స్కూల్ బెంచీలతో పాటు డెస్క్‌ బ్రిక్స్ మొదలైనవి తయారు చేస్తారు. ఆ ఉత్పత్తులన్నీ లిసిప్రియా ప్రారంభించిన 'ప్లాస్టిక్ మనీ షాప్'లో ప్రదర్శించబడతాయి.

ఈ ఇనిషేటివ్ గురించి వివరించిన లిపిస్రియ.. 'వాతావరణ మార్పులతో పోరాడాలనుకుంటే ముందుగా విద్యార్థులు, యువకులు సహా విద్యావేత్తల మద్ధతు కావాలి. అందువల్లే నా షాప్‌ను డీయూలో ఏర్పాటు చేశాను' అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed