- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమోషనల్ పోస్ట్.. విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో శ్రీను వైట్ల ఒకరు. ఒకప్పుడు ఈయన సినిమా కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురు చూసేవారు. ఇతను చేసిన దూకుడు, ఢీ సినిమాలు ఎతం పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాగా ఈయనకు సంబంధిచిన ఒక ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్య, సమంత బాటలోనే శ్రీను వైట్ల దంపతులు వెళ్తున్నారంట. త్వరలోనే ఈ డైరెక్టర్ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అటు సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు తన భార్య షాక్ ఇచ్చిందంట. శ్రీను వైట్ల భార్య రూప తాను విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందంట. ఈ క్రమంలోనే ఆమె నాంపెల్లి కోర్టు ఆశ్రయించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీను వైట్ల చేసిన ఓ ఎమోషనల్ పోస్టు ఆసక్తిగా మారింది. వారు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అందుకే డైరెక్టర్ ఈ పోస్టు చేశారంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం పోస్టు చేశారంటే ?.. శ్రీను వైట్లకు ముగ్గురు కూతుర్లున్న విషయం తెలిసిందే. వారంటే ఆయనకు చాలా ఇష్టం. అయితే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ప్రియమైన వారితో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది అంటూ.. నా ముగ్గురు మస్కిటర్స్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనంటూ ఎమోషనల్ పోస్టు చేస్తూ వారి కూతుర్లతో దిగి ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ తన భార్య కోరుకున్న విధంగానే ఆమెకు విడాకులివ్వడానికి రెడీ అయ్యాడు.. ఇప్పుడు అతను తన ముగ్గురు కూతుర్లతోనే కలిసి ఉంటున్నాడు అందుకే ఈ పోస్టు చేశాడంటూ.. చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు శ్రీను వైట్ల విడాకులపై క్లారిటీ ఇచ్చాడంటూ ముచ్చటిస్తున్నారు.