- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (16-12-2024)
మేష రాశి: ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది. నేడు ఈ రాశివారు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి: ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు.కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
మిథున రాశి: నేడు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి.
కర్కాటక రాశి: పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది.
సింహ రాశి: శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.
కన్యా రాశి: నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.
తులా రాశి: సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.
వృశ్చిక రాశి: మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.కుటుంబం సమస్యల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బంధువుల ఇంటికెళ్తారు. దీంతో రిలాక్స్ అవుతారు.
ధనుస్సు రాశి: ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. మీరు ఊహించనివారి నుంచి డబ్బు అందుకుంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.
మకర రాశి: మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి.
కుంభ రాశి: నేడు మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.
మీన రాశి: మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు. బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. వైవాహిక జీవితంలో పలు గొడవలు జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు.