వెనక భాగంలో ఈ పార్ట్స్ వద్ద కొవ్వు కరగాలంటే.. !!

by Anjali |
వెనక భాగంలో ఈ పార్ట్స్ వద్ద కొవ్వు కరగాలంటే.. !!
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో కొవ్వు(fat) పేరుకుపోవడం వల్ల బరువు(weight) పెరిగి.. అనేక వ్యాధులు తలెత్తుతాయి. కొవ్వు కణజాలం(Adipose tissue)లో రక్తనాళాల గోడల(Blood vessel walls)లోని కణాల నుంచి చాలా కొవ్వు కణాలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అంతర్దృష్టి ఊబకాయాన్ని(obesity) నియంత్రించడానికి పలు ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులు చేయాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నడుము ఎగువన, భుజాల(shoulders) వెనక కొవ్వు పెరగడం వల్ల శరీరం పైభావం లావుగా కనిపిస్తుంది. కాగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే నిపుణులు చెప్పిన వ్యాయామాలేంటో ఇప్పుడు చూద్దాం..

రేర్ డెల్డాయిడ్ రొటేషన్స్(Rare deltoid rotation)..

ఈ వ్యాయామం కోసం రెండు కిలోల బరువును సిద్ధం చేసుకోవాలి. తర్వాత నిటారుగా నిల్చోని.. చేతిలోకి బరువులు తీసుకుని చేతులను పక్కకు చాపాలి. ఇప్పుడు రెండు చేతుల్ని తిరిగి చెస్ట్ వద్దకు తీసుకువచ్చి డంబెల్స్‌ను ఆనించి.. తిరిగి హ్యాండ్స్ ను రెండు పక్కలను చాపాలి. ఇలా చేతులను ఛాతీ దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు ఊపిరి పీలుస్తూ వదలాలి. ఈ విధంగా రోజుకు 15 సార్లు చేయాలి.

రివర్స్ లంజ్(Reverse lunge)..

ఈ ఎక్సర్‌సైజ్ కొవ్వు కరిగించడంలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెన్ను వెనక భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా తొడల, కాళ్ల వద్ద కూడా ఫ్యాట్ కరిగిపోతుంది. ఇందుకోసం నిటారుగా నిల్చుని.. నడుముపై చేతుల్ని ఉంచి ఎడమ మోకాలు వంచాలి. రైట్ లెగ్‌ను రెండు అడుగులు ముందుకేసి.. ఎడమ కాలిని నేలకు తాకించాలి. అలాగే తిరిగి రైట్ లెగ్ ను వెనక్కి తీసుకురావాలి. ఇలా కాళ్లను మార్చి మార్చి రివర్స్ లంజ్ పదిహేను సార్లు చేస్తే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది.

స్క్వాట్ జంప్స్(Squat jumps)..

స్క్వాట్ జంప్స్ కోసం ముందుగా మోకాళ్లను వంచాలి. తర్వాత కిందకు కుంగినట్లుగా ఉండి.. గోడ కూర్చీ వేసినట్లుగా బాడీని ఉంచాలి. ఇదే యాంగిల్‌లో ఉండి సడన్‌గా నిటారుగా నిల్చుని గాల్లో ఎగరాలి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే? గాలిలో ఎగిరేటప్పుడు బాడీని నిటారుగా ఉంచడం మర్చిపోవద్దు. అలాగే హ్యాండ్స్ సమాంతంగా ఉండాలి. ఇలా మొదట్లో 15 నుంచి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed