Best Sleeping Tips: నిద్ర రావడం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

by S Gopi |   ( Updated:2022-04-14 08:08:24.0  )
Best Sleeping Tips: నిద్ర రావడం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో యువత, పెద్దలు ఇలా చాలామందే ఎక్కువగా ఎదుర్కొన సమస్య నిద్ర పట్టకపోవడం. ప్రస్తుతం ఉన్న వర్క్ ప్రెజర్ తో కూడిన లైఫ్ లో ప్రతి ఒక్కరూ పడుకున్నా కూడా నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నిద్రపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తొందరగా నిద్రపోవాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. బెడ్‌లైట్‌ ను చాలా మంది వాడుతుంటారు. కొంతమంది చీకటిలో నిద్రించకూడదని బెడ్‌లైట్‌ ని సెంటిమెంట్‌ గా పెట్టుకుంటారు. బెడ్‌లైట్‌ వాడేవారు కంటికి ఎదురుగా లేకుండా చూసుకోవాలి. అవకాశం ఉంటే బెడ్‌లైట్‌ ను నిద్రపోయే మంచానికి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం నిద్రలేచేవరకు ముఖంపై వెలుతురు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వెలుతురు నిద్రకు ఇబ్బంది కలిగిస్తది. కొంతమంది బయట గాలికి ప్రశాంతంగా ఉందనో లేదా కిటికీ పక్కన పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల ఉదయం సూర్యోదయం వెలుతురు ముఖం మీద పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

Advertisement

Next Story