- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakul Preet Singh: ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadri Express) సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల ఈ అమ్మడు లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’(Indian-2) సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.
కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇక రకుల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. నటుడు, నిర్మాత, బిజినెస్ మ్యాన్ అయిన జాకీ భగ్నానీ(Jackky Bhagnani) ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, రకుల్ తన పెళ్లి రోజు కావడంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. అలాగే ‘‘పెళ్లి రోజు కానుకగా నా పేరెంట్స్ నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా చిన్ననాటి జ్ఞాపకాలు(Childhood Memories) ఉన్న ఈ వీడియో నాకు చాలా స్పెషల్. చిన్ననాటి మెమోరీస్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ నవ్వుతూ,ఆడుతూ మీలోని చిన్నతనాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు రెడ్ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.
Read More..
Vijay Devarakonda: వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్ ఫుల్ వీడియో