- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ లోదుస్తుల్లో సూసైడ్ నోట్.. పోస్ట్ మార్టం చేస్తుండగా వెలుగులోకి షాకింగ్ నిజాలు..
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తంటివారి వేధింపులు భరించలేక.. ఈ కష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని వారికి భారం కాలేక తనలో తానే కుమిలిపోయింది. వేధింపులు మరి తీవ్రం కావడంతో ఇక భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. అత్తగారింట్లో ఎన్ని చిత్రహింసలకు గురైందో తన బాధలను సూసైడ్ నోట్‌లో రాసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన రాహుల్ మొదటి భార్య మరణించడంతో.. ప్రియాంక అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. మొదట్లో సాఫీగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో.. ఇటివల గొడవలు మొదలైయ్యాయి.
రాహుల్ తల్లి మాటలు విని తరుచు భార్యను కొట్టడం, వేధించడం మొదలు పెట్టాడు. అతడే కాకుండా.. అతడి కుటుంబ సభ్యులు కూడా ప్రియాంకను చిత్రహింసలు గురి చేశారు. ఇక వీరి వేధింపులు తట్టుకోలేక ప్రియాంక సూసైడ్ నోట్ రాసి.. అది అత్తింటివారికి దొరక్కుండా తన లోదుస్తులలో పెట్టుకుని.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులకు కూడా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. దీనితో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేస్తుండగా.. ఆమె లోదుస్తులలో సూసైడ్ నోట్ లభించింది.
దాంట్లో ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో రాసింది.' భర్త రాహుల్ అంటే నాకు ఇంతో ఇష్టం. కానీ అతడు వారి కుటుంబ సభ్యుల మాటలు విని నన్ను వేధిస్తున్నాడు. అంతేకాకుండా అతడు మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికే నన్ను ఇలా హింసించి దూరం పెడుతున్నాడు. నా ఆత్మహత్యకు ప్రధాన కారణం మా అత్తే. నా మరణం ఊరికే పోకూడదు.. వారిని కఠినంగా శిక్షించాలి' అని లేఖలో రాసింది. ఆమె లోదుస్తుల్లో లభ్యమైన సూసైడ్ నోట్‌ను వైద్యులు పోలీసులకు అందించారు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు.