- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఫాలో అవుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం : కోమటిరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : సభలో సమస్యలపై ప్రశ్నించకుండా అధికారపక్షం పదే పదే అడ్డుతగులుతుందని, నేను అంశాల గురించి మాట్లాడితే.. సమాధానం లేక కాంట్రాక్టర్ అంటూ తప్పు దోవ పట్టించారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయంట్ వద్ద మాట్లాడిన ఆయన.. నేను తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి రాష్ట్ర సాధనకు కృషి చేస్తే.. ఈ రోజు ఎదురు దాడి చేస్తున్నారని, ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మా వ్యాపారాలను దెబ్బ తీశారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అవే ఇబ్బందులు ఎనిమిదేళ్లుగా పెడుతుండటంలో వ్యాపారాలు మానేశామని కోమటిరెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణాలపై సమాధానాలు లేక టీఆర్ఎస్ మంత్రులు ఎదురు దాడి చేశారని, వీటన్నింటినీ ప్రజలు గమినిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ధ్వజమెత్తారు. సంప్రదాయాలను తుంగలో తొక్కి గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని, ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో దోచుకుంటుందని కోమటిరెడ్డి ఆరోపించారు.
నైనీ కోల్ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు నష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేయడం లేదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పనుల్లో ఆంధ్ర పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణ వాళ్లకు పైసలు ఇవ్వడం లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. అప్పుల తెలంగాణగా మార్చారని టీఆర్ఎస్ పై రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.