- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి, రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మోహద్ ఇంతియాజ్ ఇషాక్ నియామకం అయ్యారు. అందుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
వరంగల్ కే రెండు కార్పొరేషన్లు
వరంగల్ జిల్లా కు రెండు కార్పొరేషన్ పదవులను సీఎం కేసీఆర్ అప్పగించారు. రావుల శ్రీధర్ రెడ్డి, మెట్టు శ్రీనులు ఇద్దరు వరంగల్ జిల్లా వాసులే. కాగా రావుల శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో బీజేపీ తరుపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడియారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. వరంగల్ లో సీపీఎం పార్టీలో చురుకుగా పనిచేసిన మెట్టు శ్రీను టీఆర్ఎస్ లో చేరి పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మోహద్ ఇంతియాజ్ కాంగ్రెస్ నుంచి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తుండటంతో ఆయనకు మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించారు గులాబీ బాస్.
సీఎంను కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు
విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. చైర్మన్ పదవిని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.