- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొలువుదీరిన ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం శనివారం బాధ్యతలు స్వీకరించింది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల ఫలితాలు అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కానీ ఎన్నికల ప్రక్రియపైనా, ఓట్ల లెక్కింపుపైనా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారిక ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నికల రిట్నర్నింగ్ అధికారి హేమసుందర్ గుండె సంబంధ వ్యాధితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
దీంతో ఎన్నికల ప్రక్రియను మరో రిటర్నింగ్ అధికారి రంగాచార్యులు చొరవ తీసుకుని పూర్తి చేశారు. ప్రెస్‌క్లబ్ కొత్త అధ్యక్షులుగా వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా వనజ, మరో వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంతరావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా రాజేష్‌లతో పాటు పది మంది కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. పది మంది ఈసీ సభ్యుల్లో ఇద్దరు మహిళా కేటగిరీలో ఎన్నిక కాగా మరో ఎనిమిది మంది జనరల్ కేటగిరీలో గెలుపొందారు. పద్మావతి, మర్యాద రమాదేవి మహిళా కేటగిరీలో, ఉమాదేవి, కస్తూరి శ్రీనివాస్, గోపరాజ్. బాపురావు, రాఘవేందర్ రెడ్డి, అనిల్ కుమార్. శ్రీనివాస్ తిగుళ్ళ, వసంత్ కుమార్, జనరల్ కేటగిరీలో పదవీ బాధ్యతలు చేపట్టారు.