- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలో అత్యంత విలువైన నాణెం ఏదో తెలుసా!
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలో అత్యంత విలువైన నాణెం ఏది అని ఎప్పడైనా ఆలోచించారా. దాని ఖరీదు ఎంత ఉంటుంది, అది ఎక్కడ ఉంది, ఎందుకు దానికి అంత విలువ.. ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన నాణెం ''1933 డబుల్ ఈగిల్ గోల్డ్ కాయిన్'' అని పిలువబడే ఒక అమెరికన్ నాణెం. చారిత్రక నేపథ్యం కలిగిన ఆ నాణేం విలువ అప్పట్లో $20 లేదా రూ. 1,525.71. గత సంవత్సరం న్యూయార్క్ నగరంలో నిర్వహించిన వేలంలో ఈ నాణెం భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 138 కోట్లు పలికి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం దాని ముఖ విలువ రూ. 144 కోట్ల 17 లక్షల 95 వేల తొమ్మిది వందల యాభై రూపాయలు(రూ. 144,17,95,950).
1933 డబుల్ ఈగిల్ అనేది USలో సర్క్యులేషన్ కొరకు ముద్రించిన చివరి బంగారు నాణెం. అప్పటి US ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ బంగారు నాణెలను కరెన్సీ నుంచి తొలగించడంతో ఇది ఎప్పుడూ చెలామణిలోకి రాలేదు. నాణేనికి ఒక వైపు అమెరికాకు చెందిన లేడీ లిబర్టీ ఫోటో ఉంటుంది, మరోవైపు అమెరికన్ డేగ ఈకలు ఉన్నాయి.