Kanguva: ఢిల్లీలో ‘కంగువ’ టీమ్ సందడి.. వారితో దిగిన సెల్ఫీ వైరల్

by sudharani |   ( Updated:2024-10-26 09:06:20.0  )
Kanguva: ఢిల్లీలో ‘కంగువ’ టీమ్ సందడి.. వారితో దిగిన సెల్ఫీ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Surya), డరెక్టర్ శివ (Shiva) కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దిశ పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా న్యూ ఢిల్లీలో సందడి చేశారు ‘కంగువ’ మూవీ టీమ్. ప్రమోషనల్ ఈవెంట్‌ ఏర్పాటు చేసిన కాలేజ్‌ గ్రౌండ్‌కు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భాగంగా సూర్య, డిశాపటానీ, బాబీ డియోలో స్టేజీపై నుంచి అభిమానులతో కలిసి సెల్ఫీ దిగారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Advertisement

Next Story