ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్.. స్పెషల్ పర్సన్ రాబోతున్నారంటూ పోస్ట్

by Hamsa |
ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్.. స్పెషల్ పర్సన్ రాబోతున్నారంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురుగా అతియా శెట్టి(Athiya Shetty) సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. నటిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక అతియా శెట్టి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. క్రికెటర్ కేఎల్ రాహుల్‌(Cricketer KL Rahul)ని ప్రేమించి పెద్దలను ఒప్పించి గత ఏడాది పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, అతియా శెట్టి(Athiya Shetty) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్(good news) ప్రకటించింది. ‘‘2025 లో మా ప్రార్థనలకు అందమైన ప్రతిరూపం రానుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా చిన్ని పాదాలు షేర్ చేయడంతో పాటు దిష్టి చుక్కను కూడా పెట్టింది. దీంతో అతియా ప్రెగ్నెంట్(pregnant) అయినట్లు అర్థమవుతోంది. ప్రజెంట్ ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed