GHMC అధికారులను ప‌రుగులు పెట్టించిన అనుసమ

by Nagaya |   ( Updated:2022-06-16 13:17:36.0  )
GHMC అధికారులను ప‌రుగులు పెట్టించిన అనుసమ
X

దిశ, సినిమా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జీహెచ్ఎంసీ అధికారులను పరుగులు పెట్టించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భామ.. లేటెస్ట్ ఫొటోలు షేర్ చేయడంతో అవాక్కయ్యారు అధికారులు. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లో చెత్తా చెదారం పేరుకుపోయిన చిత్రాలు పోస్ట్ చేయడమే ఇందుకు కారణం కాగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే ఈ పోస్ట్‌పై రియాక్ట్ అయిన అధికారులు.. ఏరియా వివరాలు తెలుసుకుని క్లీన్ చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఓ హీరోయిన్ తన క్రేజ్‌ను ఇలా వాడుకుంటే బాగుంటుందంటున్న నెటిజన్స్.. ఇతరుల సంరక్షణకు చేసే పనులు కిక్ ఇస్తాయంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed