రాజీవ్‌స్వగృహ ఇండ్ల అమ్మకాలపై సర్కార్ కీలక నిర్ణయం..

by Satheesh |   ( Updated:2022-04-09 17:26:40.0  )
రాజీవ్‌స్వగృహ ఇండ్ల అమ్మకాలపై సర్కార్ కీలక నిర్ణయం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్​స్వగృహ అమ్మకాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టవర్ల వారీగా అమ్మకాలకు టెండర్లు పిలువగా.. రియల్​సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒక్కో ఇంటిని అమ్మేందుకు నిర్ణయించారు. ముందుగా బండ్లగూడ ఇండ్లను అమ్మాలని భావిస్తున్నారు. ఒక్కో ఇంటిని అమ్మేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇండ్లకు మరమ్మత్తులు మొదలుపెట్టారు. స్వగృహ సముదాయాలను క్లీన్​ చేస్తున్నారు. ఇటీవల రాజీవ్​స్వగృహ ప్లాట్లతో పాటుగా ఇండ్లను అమ్మేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ టెండర్లు ఆహ్వానించారు. అయితే, స్వగృహ టవర్ల వారీగా విక్రయాలు ప్రకటించారు. రియల్ సంస్థలు పోటీ పడుతాయని భావించారు. కానీ, పలు కారణాలతో ఒక్క సంస్థ కూడా టెండర్లకు ముందుకు రాలేదు. దీంతో గృహ నిర్మాణ సంస్థ మళ్లీ ప్రతిపాదనలు పెట్టింది. టవర్ల వారీగా కాకుండా.. ఒక్కొ ఇంటిని అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని సీఎంకు ప్రతిపాదనలు పంపించారు. సీఎం నుంచి కూడా ఆమోదం వచ్చినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ధరను ఖరారు చేసేందుకు అధికారుల బృందం పరిశీలిస్తోంది. బండ్లగూడలో స్క్వేర్​ఫీట్​రూ. 2700 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ నెల 11న ధరలను ఖరారు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed