- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదంతస్థుల కిటికీలోంచి జారిపడిన చిన్నారి.. క్యాచ్ పట్టిన రియల్ హీరో (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతుంటాయి. చావు అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చిన వారు చాలా మంది ఉంటారు. తాజాగా.. అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెట్రో కథనం ప్రకారం: చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
టోంగ్జియాంగ్‌లో షేన్ డాంగ్ అనే వ్యక్తి తన కారును పార్క్ చేస్తుండగా ఇది జరిగింది. ఓ ఐదు అంతస్థుల బిల్డింగ్ నుంచి రెండేళ్ల చిన్నారి కింద పడుతున్న సమయంలో గట్టిగా అరవడంతో అతడు ఆ దృష్యాన్ని చూశాడు. షేన్ డాన్, అతని భార్య అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కిటికీ నుంచి జారి కిందపడబోతున్న ఆ చిన్నారిని షేన్ డాన్ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. దాంతో ఆ పాప ప్రాణాలు నిలిచాయి. ప్రభుత్వ అధికారి లిజియాన్ జావో ఈ వీడియోను షేర్ చేయగా.. అది చూసిన నెటిసన్స్ షేన్ డాంగ్ నిజమైనా హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022