ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ

by Manoj |
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ
X

దిశ, ఏపీ బ్యూరో: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, శుక్రవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించింది. అన్ని పరీక్షలూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనుంది. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహించనుంది.

పరీక్షల షెడ్యూల్..

ఏప్రిల్‌ 27(బుధవారం)న తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్‌), 28న సెకండ్‌ లాంగ్వేజ్‌, 29న ఇంగ్లిష్‌, మే 2న గణితం, 4న సైన్స్‌ పేపర్‌-1, 5న సైన్స్‌ పేపర్‌-2, 6న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనుంది. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున, మిగతా అన్ని పరీక్షలూ 100 మార్కులకు నిర్వహించనుంది.

Advertisement

Next Story

Most Viewed