ఆ నిర్మాతలు నమ్మించి మోసం చేశారు.. న్యాయం కావాలంటున్న నటి వీడియో

by Disha News Desk |
ఆ నిర్మాతలు నమ్మించి మోసం చేశారు.. న్యాయం కావాలంటున్న నటి వీడియో
X

దిశ, సినిమా: హిందీ టెలివిజన్ యాక్ట్రెస్, 'దస్తాన్‌ ఎ మొహబ్బత్‌ : సలీం అనార్కలి' ఫేమ్ సోనారిక.. తనను సీరియల్ నిర్వాహకులు మోసం చేశారని ఆరోపించింది. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'దస్తాన్‌ ఎ మొహబ్బత్‌ : సలీం అనార్కలి' సీరియల్‌ మేకర్స్ రూ.70 లక్షలు ఇవ్వాల్సి ఉంది. 2018 నుంచి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

నాకే కాదు, ఆ సీరియల్‌కు పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల పేమెంట్లు కూడా పెండింగ్‌లో పెట్టారు. కరోనా నుంచి అందరం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. న్యాయం కోసం చట్టపరంగా పోరాడుతున్నాం. అయినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. వీలైనంత త్వరగా మా అందరికీ డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నాం' అని చెప్పుకొచ్చింది. లేదంటే నిర్వాహకులపై కేసు వేసేందుకు వెనకాడమని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed