- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana లో దారుణమైన పరిస్థితి.. సరికొత్త ప్రయోగంలో కేసీఆర్ సర్కార్?
దిశ, వెబ్‌డెస్క్: Telangana Government is to Appoint Academic Monitoring Officers In Every Mandal| తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ సర్వ నాశనం చేస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఘోరమైన పరిస్థితులే విపక్షాల ఆరోపణలు, తిట్లకు కారణం అవుతున్నాయి. తాజాగా వెల్లడైన నేషనల్ అచీవ్ మెంట్ సర్వేలో తెలంగాణ రాష్ట్రం దాదాపు అట్టడుగున నిలిచింది. ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాల నుండి సర్కార్ బడుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై నిత్యం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ త్వరలో ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతోందనే వార్తా హాట్ టాపిక్ అవుతోంది.
వాటి కోసం కొత్త పోస్ట్?
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యా సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్‌ను నియమించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి మండలానికి ఓ సీనియర్ ఉపాధ్యాయుడిని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్‌గా నియమించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో రెండురోజుల క్రితం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో కొందరు ఉపాధ్యాయులు, అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం.
క్షేత్ర స్థాయిలో దారుణమైన పరిస్థితి:
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాతమికొన్నత పాఠశాలలపై మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (ఎంఈఓ)లు పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే వారికి ఈ పర్యవేక్షణ బాధ్యతలతో పాటు పరిపాలనా పరమైన వ్యవహారాలు ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు రాష్ట్రంలో 596 మండలాలుంటే కేవలం 20 మందే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారని, మిగిలిన చోట్ల ఉన్నత పాఠాశాలల్లో పని చేసే సీనియర్ హెచ్ఎంలు ఇన్ ఛార్జీలుగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీరిలో చాలా మందికి కనీసం రెండు మండలాలు మరి కొంత మందికి 10 మండలాలకు పైగానే పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో పాఠశాలల పర్యవేక్షణ చేసేదెట్లా? విద్యార్థుల అకాడమిక్ వ్యవహారాలపై దృష్టి పెట్టేదెట్లా అనేది చర్యనీయాంశం అవుతోంది. ఏకీకృత సర్వీస్ నిబంధనలకు సంబంధించి కేసులు ఉండటంతో రెగ్యులర్ ఎంఈవోల నియామకాల అంశం రాష్ట్రంలో పెండింగ్ పడుతూ వస్తోంది. దీంతో ఇన్ ఛార్జీ అధికారుల కారణంగా పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విద్యారంగ నిపుణులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం వల్ల విద్యా నాణ్యత లోపిస్తుందని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉధృతం అవుతోంది. ఈ క్రమంలో ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఎంఈవోలకు సహాయకారిగా ఉండేలా మండలానికో విద్యా పర్యవేక్షణ అధికారిని నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీరు ఎంఈఓలకు సహాయకారిగా ఉంటే కేవలం విద్యా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక సీనియర్ ఉపాధ్యాయుడిని ఎంపిక చేస్తారని అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ)ను నియమించేలా కేసీఆర్ సర్కార్ ఆలోచన చేస్తోందని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని తెలుగు ఎమ్మెల్యేలు వీరే..
- Tags
- Telangana