Bhavani Ward 1997: హారర్, థ్రిల్లర్‌గా ‘భవానీ వార్డ్ 1997’.. భయపెడుతున్న టీజర్

by sudharani |
Bhavani Ward 1997: హారర్, థ్రిల్లర్‌గా ‘భవానీ వార్డ్ 1997’.. భయపెడుతున్న టీజర్
X

దిశ, సినిమా: థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చిత్రాలకు ఆడియెన్స్‌లో స్పెషల్ క్రేజ్ (Special Craze) ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే ‘భవానీ వార్డ్ 1997’ (Bhavani Ward 1997) చిత్రం రాబోతోంది. జీడీ నరసింహా (GD Narasimha) దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ & థ్రిల్లర్ (Horror & Thriller) చిత్రాన్ని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మిస్తున్నారు. ఇందులో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటిస్తుండగా.. వారికి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీజర్‌ను సత్యం రాజేష్ (Satyam Rajesh) విడుదల చేశారు. అనంతర సత్యం రాజేష్ (Satyam Rajesh) మాట్లాడుతూ.. టీజర్ (teaser) చాలా బాగుందని చెబుతూ టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఇక టీజర్ (teaser) విషయానికి వస్తే.. ‘గాడ్ విల్ ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత సోల్ (sol) ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోతుంది. అలా వెళ్లకపోతే.. ఆ సోల్ (sol) ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుంది’ అనే డైలాగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ (teaser) ఆద్యంతం భయపెట్టేలా ఉంది. కాగా.. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

Advertisement

Next Story

Most Viewed