Miss You: ‘మిస్ యూ’ అంటున్న హీరో సిద్ధార్థ్.. ఎవరినో తెలుసా?

by sudharani |   ( Updated:2024-11-12 16:14:20.0  )
Miss You: ‘మిస్ యూ’ అంటున్న హీరో సిద్ధార్థ్.. ఎవరినో తెలుసా?
X

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్ (Siddharth) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. గతేడాది ‘చిన్నా’ చిత్రంతో భారీ విజయం అందుకున్న ఈయన.. తర్వాత కమల్ హాసన్ ‘ఇండియన్-2’ (Indian-2) లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ‘మిస్ యూ’ (Miss You) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తమిళ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్‌లో విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ (teaser) విడుదల చేశారు చిత్ర బృందం.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతుల మీదుగా లాంచ్ అయినా ఈ టీజర్‌లో సిద్ధార్థ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి మెప్పించాడు. కేవలం ఒక్క నిమిషం 13 సెకన్లు ఉన్న ఈ టీజర్‌లో ఫైట్స్‌తో పాటు లవ్, ఎమోషన్స్‌ను కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఇక ట్రైలర్ ఆధారంగా చూసుకుంటే.. సిద్ధార్థ్ హీరోయిన్‌ను ప్రేమించగా.. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతున్నట్లు చూపించారు. లాస్ట్‌లో హీరోయిన్‌ను మిస్ అవుతున్నట్లు చెబుతూ ఓ సాడ్ సాంగ్ వేసుకుంటాడు సిద్ధూ. ప్రజెంట్ ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది.


Read More ...

Devaki Nandana Vasudeva : అశోక్‌ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైల‌ర్ రిలీజ్





Advertisement

Next Story