ఉద్యోగాల రిక్రూట్​మెంట్​కు పర్యవేక్షణ కమిటీ.. ఉపాధ్యాయ సంఘం డిమాండ్​

by Javid Pasha |
ఉద్యోగాల రిక్రూట్​మెంట్​కు పర్యవేక్షణ కమిటీ.. ఉపాధ్యాయ సంఘం డిమాండ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ నియామక ప్రక్రియకు మంత్రి కేటీఆర్​ఆధ్వర్యంలో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీఎస్​సీపీ ఎస్ఈయూ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన 80వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల నోటిఫికేషన్ల రిలీజ్​ నుంచి నియామకాలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని, తద్వారా నియామకాల్లో జాప్యం జరగదని ఆ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.

దీంతో నిరుద్యోగుల సౌకర్యార్థం, గందరగోళ పరిస్థితి లేకుండా ఉంటుందన్నారు. అంతేగాక రెండు నెలల వ్యవధితో నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సంవత్సరంలో అన్నీ పరీక్షలకు కలిపి ఒకే మొత్తంలో ఫీజులు నిర్ణయించి నిరుద్యోగి రిజిస్ట్రేషన్ సమయంలోనే ఫీజు తీసుకుని అతనికి ఒక యూనిక్ నెంబర్‌కు కేటాయించాలన్నారు. అంతేగాక అర్హత గల అన్ని పరీక్ష కు అనుమతి ఇచ్చేలా ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ,శ్రీనివాస్ ,రోషన్ లు కోరారు.

Advertisement

Next Story

Most Viewed