- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేజీలో కామాంధుడు.. ఆ పరీక్షలకు వచ్చిన విద్యార్థినిపై..
దిశ,కోదాడ : పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడు నీచంగా ప్రవర్తించాడు. తన కూతురు వయసున్న కళాశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక అధ్యాపకుని వ్యవహారం కోదాడ పట్టణంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వివరాల ప్రకారం .. కే.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 రోజులుగా సైన్స్ ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయోగ పరీక్షలకు హాజరైన విద్యార్థులపై కళాశాల అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థినులు లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బోర్డు అధికారులు కళాశాలలో విచారణ జరిపారు. బోర్డు అధికారులు సదరు అధ్యాపకుని హెచ్చరించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. కాగా, సదరు అధ్యాపకుడు సెలవుపై తమ ఊరికి వెళ్లాడు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ ముగిసిన తర్వాత, సదరు అధ్యాపకుడి పై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.