- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పినవి ఆచరణలో సాధ్యమేనా.. బడ్జెట్‌లో పసలేదంటున్న విపక్షాలు
దిశ, ఏపీ బ్యూరో: అట్టహాసంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పసలేదని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రం ఇబ్బడిముబ్బడిగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా సంక్షేమ పథకాలకే మరలా పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్లో చెప్పినవి ఆచరణ సాధ్యం కాదంటున్నాయి. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్లో మరేం లేదని పేర్కొంటున్నాయి. సాధారణంగా పన్నుల రూపేణా రాష్ట్ర ఆదాయం ఎంతో చూపి, అనంతరం దానిబని ఈ విధంగా అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతున్నారనేది ఏ రాష్ట్రమైనా బడ్జెట్లో చూపిస్తుంటుంది. కానీ విచిత్రంగా ఖర్చును చూపిన వైసీపీ ప్రభుత్వం బడ్జెట్లో ఆ డబ్బులు ఎలా వస్తున్నాయనే అంశాన్ని మాత్రం చెప్పనే లేదు. రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు అని చెప్పిన ఆర్థికమంత్రి ఆ డబ్బు ఎలా వస్తుంది అన్న విషయాన్నీ మాత్రం దాటేశారు. దాన్నే విపక్షాలు తప్పు పడుతున్నాయి.
గత బడ్జెట్లతో పోలిస్తే కీలకమైన విద్య, వైద్య, వ్యవసాయం లాంటి రంగాలకు ఈ బడ్జెట్‌లో కోత పడిందనేది విపక్ష నేతల ప్రధాన ఆరోపణ. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు నిధులను బాగా తగ్గించి వేశారని వారంటున్నారు. జనాభాలో 17 శాతం ఉన్నవారికి కేవలం 7 శాతం నిధులు కేటాయింపు అన్యాయం అని పేర్కొంటున్నారు. విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం కేటాయింపులు ఉండాల్సి ఉండగా ఈ బడ్జెట్‌లో కేవలం 12 శాతమే ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీలకమైన వ్యవసాయరంగానికి సైతం 1000 కోట్లు వరకూ కోత పడినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి .
అమరావతికి నిధులేవీ?
అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టవద్దు అని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అమరావతి ప్రస్తావన కాస్తయినా బడ్జెట్లో ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్నీ పక్కన పెట్టేసింది. అమరావతి నిర్మాణం మాటెలా ఉన్నా .. కనీసం అక్కడి రైతులకు సంబంధించిన అంశాలు గురించి మాటమాత్రమైనా ప్రస్తావన లేదని విపక్షాలు అంటున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధుల ప్రస్తావన లేదు : బీజేపీ ఎంపీ, జీవీఎల్ నరసింహారావు
ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుకయ్యే ఖర్చుకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదు. వాటిని ఎక్కడి నుంచి తెస్తారు. ఈ బడ్జెట్ కేవలం వైసీపీ మేనిఫెస్టోలా ఉంది. ఈ నెల 19న కడప లో జరిగే బహిరంగ సభలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతాం.
బడ్జెట్ కాగిత ప్రకటనలకే పరిమితం : రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న, టీడీపీ నేత బుచ్చయ్య
''అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తం హాస్యాస్పదంగా ఉంది. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చేసిన అతి తక్కువ కేటాయింపులు కచ్చితంగా నిబంధనలకు విరుద్ధం. బీసీలకు సంబంధించిన కేటాయింపుల్లో స్పష్టత లేదు. ఇది చీకటి బడ్జెట్ అని'' సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ''గత బడ్జెట్ పై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. నిజాలు పెచిపెడుతూ ప్రజల్ని మభ్యపెట్టడం ఆర్థిక ఉగ్రవాదం అని'' వెల్లడించారు. ''ఇదొక మోసపూరిత బడ్జెట్ అని'' పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇదొక డాంబికాల బడ్జెట్ : జనసేన నేత మనోహర్
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఒక డాంబికాల బడ్జెట్. గతేడాది బడ్జెట్లోని అంశాలను సవరించడం మినహా కొత్త అంశాలు ఏమున్నాయి. గత బడ్జెట్లో రోడ్లకు కేటాయించిన రూ.7,500 కోట్లను సవరించి రూ.5 వేల కోట్లుగా పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ. 2 వేల కోట్లను ఖర్చు చేయని ప్రభుత్వం, ఈ ఏడాది ఏకంగా 8,500 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నది. 97 వేలమంది మత్స్యకారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్టు ఆర్థికమంత్రి గొప్పగా చెప్పారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల సంఖ్య 2 లక్షలా30 వేలమందిగా ఉంది. కేవలం 97 వేలమందికే లబ్ధి చేకూర్చడమేంటని అని ప్రశ్నించారు.
పరిశ్రమల శాఖకు బడ్జెట్ ఇవ్వకుంటే ఎలా?
గత బడ్జెట్లో ఇన్ఫ్రా కోసం రూ.1,133 కోట్లు కేటాయించి, దాన్ని సవరించి రూ. 331 కోట్లకు తెచ్చారు. పరిశ్రమల శాఖకు రూ. 2,540 కోట్లు కేటాయించినట్టు చెప్పి మళ్లీ సవరించి, రూ.1,905 కోట్లకు కుదించారు. దీంతో రాష్ట్రానికి నూతన పరిశ్రమలు ఏ నమ్మకంతో వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు.