- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాటా గ్రూప్ నుంచి డిజిటల్ చెల్లింపుల యాప్!?
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల సేవలను అందిస్తున్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి కంపెనీలకు త్వరలో టాటా గ్రూప్ పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా సంస్థ యూపీఐ చెల్లింపుల యాప్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులను కూడా సాధించినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా యూపీఐ చెల్లింపుల కార్యకలాపాలను నిర్వహించడానికి ఐసీఐసీఐ బ్యాంకుతో చర్చలు సైతం జరిపినట్టు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ విభాగం వెల్లడించిందని ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. సాధారణంగా బ్యాంకింగేతర సంస్థలు థర్డ్ పార్టీ చెల్లింపుల సేవలను ప్రారంభించడానికి బ్యాంకులతో ఒప్పందం చేసుకోవడం తప్పనిసరి. ప్రముఖ చెల్లింపుల యాప్ గూగుల్‌పే కూడా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.