సరికొత్త కాన్సెప్ట్ కారు మోడల్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్!

by Harish |
సరికొత్త కాన్సెప్ట్ కారు మోడల్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయంగా ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ బుధవారం మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ మోడల్ 'కర్వ్'ను ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇదివరకు విడుదల చేసిన టాటా నెక్సాన్, టిగోర్ మోడల్ తరహాలో కాకుండా కొత్త జనరేషన్ కాన్సెప్ట్‌లో తీసుకొచ్చింది. ప్రధానంగా అత్యాధునిక టెక్నాలజీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 400-500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 'లెస్ ఈజ్ మోర్ ' డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై తెచ్చిన ఈ కాన్సెప్ట్ మోడల్ కార్లను రాబోయే రెండేళ్ల తర్వాత విక్రయించనున్నట్టు కంపెనీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. ఈ రకమైన వాహనాలు మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కంటే పెద్దదిగా ఉంటుందని, ప్రీమియం ఎస్‌యూవీ కంటే తక్కువగా ఉండేలా రూపొందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story