- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమర్షియల్ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏప్రిల్ 1 నుంచి తన వాణిజ్య(కమర్షియల్) వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ని బట్టి ధరల పెంపు 2-2.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహాల ధరలు భారంగా మారాయని కంపెనీ వెల్లడించింది. తయారీలోని వివిధ స్థాయిలో వ్యయం గణనీయంగా పెరిగిందని, దీన్ని నియంత్రించేందుకు సంస్థ ప్రయత్నించినప్పటికీ మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల వినియోగదారులకు కొంత భారం బదిలీ చేయక తప్పడం లేదని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది టాటా మోటార్స్ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవడం ఇది రెండోసారి. జనవరిలో ప్యాసింజర్ వాహనాల ధరలను స్వల్పంగా పెంచింది. ఆ సమయంలో 0.9 శాతం పెంచినప్పటికీ, కొన్ని వేరియంట్లపై రూ. 10 వేల వరకు తగ్గింపును ఇచ్చామని కంపెనీ వెల్లడించింది.