- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika పబ్ ఇష్యూపై తమన్నా సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ మింక్ పబ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుల పిల్లలు, రాజకీయ నాయకులు పిల్లలు ఉండటంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా మెగా డాటర్ కొణిదెల నిహారిక హైలెట్ అయింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో.. నిహారికపై, మెగా ఫ్యామిలీపై నెటిజెన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు.
నిహారిక ఫ్రెండ్ బర్త్ డే ఉంటే ఆ రోజు పబ్‌కు వెళ్లిందని.. దానిని మీడియా, కొన్ని యూట్యూబ్ చానెల్స్ హైలెట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అయినా ఆ రోజు పబ్‌లో పోలీసులు 150మందిని అదుపులోకి తీసుకుంటే.. ఒక్క నిహారికనే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించింది. పోలీసులు నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పలేదని.. కానీ కొంతమంది మాత్రం అడ్డంగా బుక్ అయినా నిహారిక అది ఇది అని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నరంటూ ఫైర్ అయింది. అసలు పబ్‌కు వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మెగా ఫ్యామిలీపై, నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకుంటామంటూ హెచ్చరించింది. పబ్‌లో ఎవరో ఒక్కరు చేసే తప్పు వల్ల.. అందరిని దొంగల్లా చూడటం కరెక్ట్ కాదని అన్నారు.