- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళలో స్వైన్ ఫీవర్ అంటువ్యాధి కలకలం..
దిశ, ఫీచర్స్ : దేశంలో కరోనా కలకలం రేపుతోంది. దీంతోపాటు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొవిడ్ వేరియంట్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే అంటువ్యాధి కల్లోలం సృష్టిస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నివేదించబడిన తరువాత ఈ అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇది వరకే తెలిపింది. ఇక తాజాగా ఈ కేసులు కేరళ వాయనాడ్‌లో కనుగొనబడ్డాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో పంది రక్త నమూనాలను గుర్తించిన అనంతరం సమీపంలోని అన్ని పొలాల నుంచి 300 పందులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏంటి :
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు సంక్రమించే అంటువ్యాధి. ఇది దేశీయ మరియు అడవి పందులను అధికంగా ప్రభావితం చేస్తుండటంతో మరణాల రేటు వంద శాతంగా ఉంది. అయితే ఈ అంటువ్యాధి మనుషుల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపించనప్పటికీ.. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దీనికి సమర్థవంతమైన వ్యాక్సిన్ కూడా లేదు. ఈ వైరస్ అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలదు. బట్టలు, బూట్లు, ఫర్నిచర్, చక్రాలు,ఇతర పదార్థాలపై జీవించగలదు. పంది మాంసంతో తయారు చేయబడిన అన్ని కోల్డ్-ప్రెస్డ్ ఉత్పత్తులు - బేకన్, సాసేజ్‌లు, హామ్ మొదలైనవి వైరస్ బారిన పడతాయి.
భారతదేశంలో పందుల పెంపకం లాభదాయకమైన వ్యాపారం. సెమీ-వాణిజ్య పందుల పెంపకంలో ఎక్కువ భాగం కేరళ, పంజాబ్ మరియు గోవాలో ఉన్నాయి. అలాగే.. ప్రోటీన్ల యొక్క ప్రాథమిక వనరులలో ఒకటైన పంది మాంసం.. ప్రపంచవ్యాప్తంగా 35 శాతానికి పైగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముఖ్యమైన సమస్యగా ఉంది.
ప్రధాన లక్షణాలు
* ముక్కు, చెవులు, తోక, కాళ్ల కింద నీలం - ఊదా సైనోసిస్
* తీవ్ర జ్వరం
* కళ్లు మరియు ముక్కు నుండి భారీ ఉత్సర్గ