Hijab వివాదంపై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

by S Gopi |   ( Updated:2022-07-13 11:05:28.0  )
Supreme Court to Hear Hijab Petition Next week
X

న్యూఢిల్లీ: Supreme Court to Hear Hijab Petition Next week| హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్న అంశాలకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించాలని వెల్లడించింది. అయితే మార్చిలో పిటిషన్ దాఖలు చేశామని, జాబితాను సమర్పించడానికి సమయం కోరడంతో వచ్చే వారానికి విచారణను వాయిదా వేశారు.

కాగా, కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన హిజాబ్‌లు ధరించడం ఇస్లాం ముఖ్యమైన ఆచారం కాదని తీర్పునిచ్చింది. కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. పాఠశాలలో హిజాబ్ ధరించడం వ్యతిరేకమని.. తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కర్ణాటకకు చెందిన ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉడిపికి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని కర్ణాటక విద్యాచట్టంలో లేదని పేర్కొన్నారు. హిజాబ్ ధరించే హక్కు గోప్యత హక్కు పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. కర్ణాటక హైకోర్టు తీర్పునివ్వడంలో విఫలమైందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టుకు వేడుకున్నారు.

Also Read: యూపీకి చేరిన టీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ.. మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Advertisement

Next Story

Most Viewed