Suriya: సూపర్ స్టార్ మాట నాలో మార్పు తీసుకొచ్చింది.. సూర్య కీలక వ్యాఖ్యలు

by Hamsa |
Suriya: సూపర్ స్టార్ మాట నాలో మార్పు తీసుకొచ్చింది.. సూర్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సూపర్ స్టార్ రజినీ కాంత్‌(Rajini Kanth)పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘కొన్నాళ్ల క్రితం నేను రజినీకాంత్ ఒకే విమానంలో ప్రయాణించాం. అప్పుడు పలు విషయాలపై చర్చించుకున్నాము. అయితే ఆయన నా సినిమాలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయం చెప్పారు. ‘మీలో స్టార్ మాత్రమే కాదు మంచి నటుడున్నారు. అందుకే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకే పరిమితమై కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నించండి’ అని అన్నారు. ఆయన ఆ మాట చెప్పడం వల్లే ఓ యాక్షన్ ఫిల్మ్ సింగం, జై భీమ్ లాంటి డ్రామాలోనూ నటించాను.

ఈ విషయం తెలుసుకున్న నా కుమార్తె కూడా చాలా సార్లు ఈ రెండు సినిమాల్లో అంత వైవిధ్యం ఎలా చూపించావు అని అడిగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రజెంట్ సూర్య ‘కంగువా’(Kanguva) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని శివ(Shiva) తెరకెక్కించగా.. నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే ఇందులో దిశా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ‘కంగువా’ (Kanguva)నుంచి ఓ సాంగ్ కూడా విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed