Summer Health tips: ఎండాకాలంలో శరీరం చల్లగా ఉండాలా.. ఇలా ట్రై చేయండి

by samatah |   ( Updated:2022-04-07 04:28:53.0  )
Summer Health tips: ఎండాకాలంలో శరీరం చల్లగా ఉండాలా..  ఇలా ట్రై చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది నీరసంగా ఉంటారు. అలాగే అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఎండలో ఎక్కువ సేపు తిరగటం లేదా, వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఉండటం వలన మన శరీరంలోని నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అందువలన క్రమం తప్పకుండా నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవడంవలన శరీరం చల్లగా ఉంటుంది, ఏ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

  • నారింజ, పుచ్చకాయలు, దోసకాయ, నిమ్మకాయలు వంటి నీటి పదార్థాలు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వేసవి కాలంలో ఆరోగ్యానికి చాలా మంచింది.
  • శరీరంలో చెడు పదార్థాలను బయటకు పంపిచడంలో నిమ్మకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువలన వేసవి కాలంలో నిమ్మకాయతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అది చర్మాన్ని హైడ్రేట్ చేస్తోంది.
  • ఎండాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాల్లో మజ్జిగ ఒకటి. రోజుకు రెండు మూడు సార్లు మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి చల్లదనం అందుతుంది.
  • అలాగే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండా నీరు కూడా దోహదం చేస్తోంది. అలాగే కర్బూజ, పుచ్చకాయ కూడా శరీరానికి చాలా మంచిది.

Advertisement

Next Story

Most Viewed